ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా ముందుకు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్, నెహ్రూనగర్ లలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, విద్యుత్ విభాగం, జిహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్, అర్బన్ ఫారెస్ట్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు నూతన సివరేజి పైప్ లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేశార‌ని, వారి ఫిర్యాదు మేరకు అతి త్వరలో ప్రత్యేక దృష్టి సారించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేసేందుకు వాటర్ వర్క్స్ అధికారులతో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సీసీ రోడ్లు దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన రోడ్లు త్వరలో ప్రారంభించి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం పనులలో భాగంగా చెత్త సేకరణ పై ఆరా తీశారు. త్రాగునీటి క్లోరినేషన్ దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, నూతన స్స్ట్రీట్ లైట్స్, ఐ మాస్ లైట్స్ ను దశల వారిగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఎంహెచ్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఈఈ శిరీష, డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, జిహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్ ఏఈ లిఖిత, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, సీనియర్ నాయకుడు యాదా గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గోపినగర్ అంబేద్కర్ భవన్ అధ్యక్షుడు రమేష్, ముంతాజ్ బేగం, మహేందర్ సింగ్, నరసింహ, నరసింహా రెడ్డి, పిల్లి యాదగిరి, దస్తగిరి, అలీం, ఖాదర్ ఖాన్, గౌతమ్, నరేందర్, మహేష్, నాందేవ్, షైబాజ్, వినయ్, విజయ్, సల్మాన్, విద్యుత్, యూబీడి, శానిటేషన్ సిబ్బంది, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here