విద్యార్థుల మాన‌సిక ఆరోగ్యాన్ని పెంపొందించాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ ZPHS పాఠశాలలో జరిగిన NCC దినోత్సవం కార్యక్రమంలో మండల విద్యాధికారి(MEO) వెంకటయ్య, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మియపూర్ ఉన్నత పాఠశాలలో NCC దినోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, NCC ప్రధాన లక్ష్యం పాఠశాల, కళాశాల విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే అని అన్నారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో అవసరం నుండి NCC పుట్టింద‌ని, ప్ర‌స్తుతం ఇది భారతదేశంలోని 780 జిల్లాల్లో 713 జిల్లాలకు విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫాం ధరించిన యువజన సంస్థగా కీర్తింపబడుతుంద‌ని అన్నారు. విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణ, డ్రిల్, ఆయుధాల వినియోగం వంటి వాటిపై శిక్షణ ఇస్తార‌ని అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పెపొందించే యోగా, కరాటే లాంటివి విధిగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు వసుంధర, ఎంపీపీ ప్రధానోపాధ్యాయులు యూసఫ్, ఉపాధ్యాయులు మదన్ మోహన్, బాల్ రెడ్డి, వీణ, శ్రీలక్ష్మి, ఎన్సిసి ఇంచార్జ్ హిమబిందు, స్థానిక నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గంగాధర్, మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా, జాఖిర్, వెంకటేశ్వరరావు, సుప్రజ, చంద్రకళ, జ్యోతి, నరేష్ నాయక్, వెంకటేష్ గౌడ్, సాంబయ్య, రాజేశ్వరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here