శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీ నాయకులంతా జూబ్లీహిల్స్ లో కలసి కట్టుగా పనిచేసి బీసీ నాయకుడు నవీన్ యాదవ్ ను గెలిపించుకున్నారని అన్నారు. ఈ గెలుపు బీసీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. బీసీలందరూ ఇలాగే ఐక్యంగా ఉండి మరిన్ని విజయాలను సాధించాలని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడమే ప్రథమ లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, హరికృష్ణ చారి, కనక చారి, రాజు భట్రాజు శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కెపిహెచ్బి, kphb నాగరాజు Yada, వెంకటయ్య, చేవెళ్ల కృష్ణ యాదవ్, కందాడ ఎంపీపీ రవీందర్ యాదవ్, శ్రీపురం హరికృష్ణ చారి, బిసి సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ, భటరాజుల సంఘం బంటు రాజు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.






