ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాల‌ను కల్పిస్తున్నాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం గ్రామంలోని ప్రజలు ఇటీవల తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలతో కలిసి సమస్యలపై కార్పొరేటర్ గంగాధర్ పాదయాత్ర చేశారు. ప్రధానంగా పురాతన భూగర్భ డ్రైనేజి పైపులైన్‌లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పైపులు దెబ్బతినడం వల్ల డ్రైనేజి నీరు తరచుగా నిలిచిపోతూ, డ్రైనేజి నీరు ఓవర్‌ఫ్లో అయి ఇళ్లలోకి చేరి రోజువారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పురాతన నీటి భూగర్భ డ్రైనేజి పైపులైన్‌లను ఆధునిక పైపులైన్‌లతో మార్చి, భూగర్భ డ్రైనేజి పైపులైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని కోరారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటిని నోట్ చేసుకొని వీలైనంత త్వరగా అందుకు అవసరమైన నిధులు కేటాయించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ డీజీఎం నరేందర్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఈఈ శిరీష, ఏఏంఓహెచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎంటమాలజీ ఏఈ తనూజ, సీనియర్ నాయకులు అనిల్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, నందు, కృష్ణ ముదిరాజ్, కృష్ణ యాదవ్, నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, మహేందర్, సురేందర్, అశోక్, సురేష్, దయాకర్, తిరుపతి, దుర్గా రామ్, సతీష్ గౌడ్, శ్రీశైలం, శామ్లెట్ రాజు, గణేష్, రాజేందర్, ప్రవీణ్, ఇందిరా, శ్రీను, రాజు, యాదయ్య, గోవిందా, జిహెచ్ఎంసి అధికారులు, వర్క్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here