శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఆదిభట్లలోని శ్రీ చైతన్య పాఠశాలలో నాసా కాంటెస్ట్ ప్రోగ్రాంకు ఎంపికైన 213 మంది విద్యార్థులకు నాసా కిట్లను పంపిణీ చేశారని దిల్‌సుఖ్‌నగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం టి. సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కే రామ్మోహన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగాలలో నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. నాసా కాంటెస్ట్ కు ఎంపిక కావడం గర్వకారణం అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా పెద్ద విజయాలను సాధించాలని సూచించారు. అనంతరం ఎంపికైన 213 మంది విద్యార్థులకు నాసా కిట్లును అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్స్ రవికుమార్, పుల్లారావు, శ్రీ చైతన్య పాఠశాల ఆదిభట్ల ప్రిన్సిపల్ సతీష్, హుస్సేన్, వైస్ ప్రిన్సిపల్స్ చంద్రశేఖర్, వాహిని, డీన్లు మహిపాల్ , సాయికుమార్, ఏవోలు వెంకటేశం, ఇస్మాయిల్, ఇంచార్జులు, దిల్ సుఖ్‌నగర్ జోన్ నాసా మెంటర్ సంతోష్, నాసా ఇంచార్జిలు సైదులు, శ్రావణ్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.





