శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో రాబోయే రోజుల్లో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరబోతున్నారని చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టేట్ జాయింట్ సెక్రెటరీ ఎం.విమల్ కుమార్, లింగంపల్లి షాప్ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కె.శంకర్, క్లాసికల్ డ్యాన్స్ టీచర్ మాదాని దివ్య రెడ్డి, కె.రఘునాథ్ రెడ్డిలతోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి MLA మాధవరం కృష్ణారావు సూచనలు, సలహా మేరకు మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవతా రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో అభివృద్ధి కుంటు పడిందని, ప్రజలు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, వారు ఏ పార్టీ లో ఉన్నారో వారికే తెలియని పరిస్థితిలో ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి వారి పదవులను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజల వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, వాల హరీష్, పార్నంది శ్రీకాంత్, రవీందర్ యాదవ్, గౌస్, బాబు మల్లేష్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.






