శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నెహ్రూ నగర్‌లో నిర్వహించిన గ్యారవి షరీఫ్ కవ్వాలి వేదిక కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక వాలీబాల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాత్మక ప్రదర్శనలు, కవ్వాలీ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం రవి యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సాన్నిహిత్యాన్ని బోధిస్తాయన్నారు. యువతను సాంప్రదాయాలతో అనుసంధానం చేయడం ద్వారా సమాజం బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కే.ఎన్.రాములు, మల్లేష్ ముదిరాజ్, వెంకటాచారి, గడ్డం శ్రీనివాస్, నవీన్ గౌడ్, కొండకల్ శ్రినివాస్, ఆర్.జమ్మయ్య, శంకర్, శ్రీకాంత్ యాదవ్, కె రాజు చారి, రాజు గౌడ్, నర్సింహా, Sk. గఫ్ఫార్, ఖాదర్ ఖాన్, sk తాహెర్, SK అజిజ్, జగదీష్, చిన్న రెడ్డి, SK అలీం, Md. సల్మాన్, Md. మొయిజ్, సాదిక్, Md. దస్తగిరి, SK. హాజీ, ముస్లింలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.






