శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ముజఫర్ అహమ్మద్ నగర్ లో షహీద్ భగత్ సింగ్ చిత్రపటానికి ఎ ఐ ఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని తన పోరాటంతో ఉవ్వెత్తున తీసుకెళ్లి ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి నూనూగు మీసాల చిన్న వయసులోనే రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ పార్లమెంటు పైన బాంబుల వర్షం కురిపించి చిరునవ్వులు చిందిస్తూ ఉరికొయ్యలను ముద్దాడుతూ ఇంక్విలాబ్ నినాదాన్ని దేశ యువతకు ప్రజలకు అందించి యువతను విప్లవ బాటలో పయనించాలని, బానిసత్వాన్ని ఎదిరించాలని, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి పారద్రోలే వరకు నిద్రపోనని శపథం చేసిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన మరణం ఈ దేశంలో విప్లవానికి శంఖారావాన్ని పూరించిందని, యువతరాన్ని మేల్కొల్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎఫ్ డి వై గ్రేటర్ నాయకులు డి మధు సూదన్, ఇస్లావత్ దశరథ్ నాయక్, యం డి సుల్తాన బేగం, డి శ్రీనివాసులు, డి నర్సింహా, మహిళ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అంగడి పుష్ప, జి శివాని తదితరులు పాల్గొన్నారు.






