శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆర్. దామోదర్ రాజనర్సింహను TRPS RMP PMP వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా వెంకట్ రెడ్డి సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంకట్ రెడ్డి మంత్రికి వివరించారు.






