శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మిరియాల రాఘవరావు, మిర్యాల ప్రీతం ఆయన నివాసానికి వెళ్లి శాలువా కప్పి సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం మాట్లాడుతూ రంజిత్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రజా సేవను తన జీవిత లక్ష్యంగా మలచుకున్నారు. ఆయన అందించిన అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రజల్లో విశేష గుర్తింపు పొందాయి. ఇంతటి మంచి హృదయంతో ముందుకు సాగే నాయకుడు మరింత శ్రేయస్సు సాధించాలని కోరుకుంటున్నాం అన్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని, ఆయన నాయకత్వంలో ప్రజా సంక్షేమం మరింత విస్తరించాలని స్థానికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, ప్రసాద్, త్రినాథ్, సుబ్రహ్మణ్యం, టిల్లు, బబ్లు, చింటూ, రాకేష్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.






