సేవా పక్షం కార్య‌క్ర‌మాన్ని డివిజన్ స్థాయిలో నిర్వహించాలి: రాధాకృష్ణ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల‌ని బీజేపీ జిల్లా ఉపాధ్య‌క్షుడు రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ సేవా పక్షం 2025లో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ కార్యశాల హుడా కాలనీలో సమావేశం నిర్వ‌హించారు. హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో బీజేపీ సేవా పక్షం కార్యశాల జిల్లా కన్వీనర్ రాధాకృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపుమేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవా పక్షం కార్య‌క్ర‌మాన్ని డివిజన్ స్థాయిలో నిర్వహించాల‌న్నారు. హైదరాబాద్ విమోచనకు, తెలంగాణ స్వాతంత్ర్యానికి ప్రాణత్యాగం చేసిన వీరుల చరిత్ర ప్రతి తరానికి తెలిసి తీరాల‌ని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం వల్లే తెలంగాణ భారతదేశంలో విలీనం అయింద‌న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని అన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ సేవా పక్షం డివిజన్ కన్వీనర్ అజిత్ సేనాపతి , డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు , మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ జిల్లా గీత‌ సెల్ కన్వీనర్ రవి గౌడ్ , బీజేపీ నాయకుడు సత్యనారాయణ రాజు , బిజెపి జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి , బీజేపీ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ పృథ్వీ కాంత్ గౌడ్ , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు రాజు ముదిరాజ్ , జగదీశ్వర్ గౌడ్ , మహిళా నాయకురాలు పార్వతి , నిర్మలా , డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు , ప్రసాద్ పాత్రో , శివ ముదిరాజ్ , డివిజన్ బిజెపి నాయకులు పీ శ్రీనివాస్ , నరసింహ యాదవ్, శ్రీకాంత్ , రామ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామచంద్ర యాదవ్, బాలరాజు, ఆకాష్ గౌడ్, లక్ష్మణ్ , బీజేవైఎం నాయకులు మహేష్ గౌడ్ , రామకృష్ణ , ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here