శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మలబార్ గ్రూపు సి.ఎస్.ఆర్ ప్రాజెక్ట్ లో భాగంగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాతో నర్చరింగ్ బిగినింగ్స్ అవగాహన ఒప్పందంపై మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియా ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ ఆఫ్రిన్ సంతకం చేశారు. కోయికోడ్‌లోని మలబార్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మలబార్ గ్రూప్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆషర్ ఓ, WHO నేషనల్ ప్రొఫెషనల్ ఆఫీసర్ డాక్టర్ బి.ముహమ్మద్ అషీల్, మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషాద్ ఎ.కె హాజరయ్యారు. సామాజిక బాధ్యత పట్ల తన నిరంతర నిబద్ధతలో భాగంగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియా సహకారంతో నర్చరింగ్ బిగినింగ్స్ అనే కొత్త సి.ఎస్.ఆర్ చొరవను ప్రారంభించినట్లు మలబార్ గ్రూపు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల తల్లులు, పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు, వారి శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి, పిల్లల మానసిక, మేధో వికాసానికి మద్దతు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవ సంస్థ థనల్ చైర్మన్ డాక్టర్ వి.ఇద్రీస్, సీనియర్ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.






