శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనాగూడ పోచమ్మ టెంపుల్ చౌరాస్తాలో రహదారులపై ఎక్కడికక్కడ చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నాయకులు బాబు మోహన్ మల్లేష్, జనార్దన్ గౌడ్ అన్నారు. రహదారులపై చెత్త వెయ్యడం వల్ల పరిశుభ్రత లోపించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ముఖ్యంగా టైఫాయిడ్, డెంగ్యూ జ్వరం వస్తున్నాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రహదారులపై ఎక్కడా చెత్త కనిపించేది కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






