శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట శివాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో గణనాథుడి లడ్డూ వేలం పాటను ఉత్సాహంగా ఏర్పాటు చేశారు. ఈ వేలంలో మొదటి లడ్డూను రూ.1.57 లక్షలకు టీమ్ శివాలయం యూత్ గణేష్ కైవసం చేసుకున్నారు. రెండో లడ్డూను ఈర్ల అభిలాష్ రూ.1.45 లక్షలకు దక్కించుకున్నారు.






