శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): తీవ్రమైన హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధుడికి ప్రముఖ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, చీఫ్ కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ సాయి సుధాకర్ పునర్జన్మనిచ్చారు. తీవ్రమైన Mitral Regurgitation (MR) అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల వృద్ధుడికి ప్రత్యేకమైన Mitral Clip device (MyClip) ను అమర్చారు. ఈ శస్త్ర చికిత్సను డాక్టర్ సాయి సుధాకర్ విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఆ వృద్ధుడు తిరిగి కోలుకుంటున్నాడు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్ సాయి సుధాకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ Mitral Regurgitation (MR) అనే తీవ్రమైన హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల వృద్ధుడికి గత 2 ఏళ్లుగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందన్నారు. ఆయన కాళ్లు వాపులకు గురయ్యాయని, రోజువారి పనులు నిర్వహించడం కూడా కష్టంగా మారిందని తెలిపారు.

సదరు వృద్ధుడికి పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నా అవి చాలా క్లిష్టతరమైనవిగా భావించినట్లు డాక్టర్ సాయి సుధాకర్ తెలిపారు. అలాగే మెడిసిన్లను తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం లేదని తాము గుర్తించామని, కనుక ఆ వృద్ధుడికి Mitral Clip device (MyClip) ను అమర్చడం ఒక్కటే మార్గమని భావించామని, ఈ క్రమంలోనే ఇటీవలే ఆయనకు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని, ప్రస్తుతం ఆ వృద్ధుడు కోలుకుంటున్నాడని, తన రోజువారి పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడంతోపాటు వ్యాయామం కూడా చేయగలుగుతున్నాడని అన్నారు. ఇదంతా Mitral Clip device (MyClip) వల్లనే సాధ్యమైందని అన్నారు.

గతంలో ఈ క్లిప్ కావాలంటే చాలా ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుతం చాలా తక్కువ ధరకే తెలుగు రాష్ట్రాల్లో Mitral Clip device (MyClip) లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా అధిక శాతం మంది, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు Mitral Regurgitation (MR) అనే సమస్యను ఎదుర్కొంటున్నారని, వారందరికీ ఈ Mitral Clip device (MyClip) చక్కని పరిష్కారాన్ని అందిస్తుందని తెలిపారు. ఇది చాలా సులభమైన, తేలికైన శస్త్ర చికిత్స అని, దీని వల్ల రోగి త్వరగా కోలుకోవడంతోపాటు ఎప్పటిలాగే వ్యాయామం చేయడం, రోజువారి పనులు చేయడం వంటివి సులభంగా చేసుకోగలుగుతారని అన్నారు.





