పాపమ్మ బస్తీలో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పాపమ్మ కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగి సమస్యగా ఉందని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ పాపమ్మ బస్తీలో పర్యటించి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజీ క్లియర్ గా ఉండి కూడా నీరు రోడ్డు పైకి పొంగి ప్రవహిస్తోందని, ఎక్కడైతే పొంగుతుందో ఆ మ్యాన్ హోల్ నుండి ముందు మ్యాన్ హోల్ మధ్యలో పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి ఉండవచ్చు కాబట్టి వెంటనే మరమ్మతు పనులు మొదలుపెట్టి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తునందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భారీ వర్షాలతో ఎటువంటి ఇబ్బందులు కలిగినా, ఎలక్ట్రికల్, రోడ్డు, డ్రైనేజీ, మంచి నీటి వంటి సమస్య లు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు గానీ, త‌మ‌కు గానీ త‌మ కార్యాలయాన్ని గానీ సంప్రదించాలని తెలియజేశారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని , GHMC అధికారులు, మాన్ సున్ ఎమర్జెన్సీ టీమ్స్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని తెలిపారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పాపమ్మ, రాంచందర్, వేలు, రాము, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here