వరద నీటి కాలువ నిర్మాణం పనులను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ నారాయణ కాలేజీ నుండి దీప్తి శ్రీనగర్ కాలనీ వరకు రూ.43 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టిన వరద నీటి కాలువ నిర్మాణం పనులను చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు రఘునాథ రెడ్డితో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కృషినగర్ నారాయణ కాలేజ్ నుండి దీప్తి శ్రీ నగర్ కాలనీ వరకు వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన వరద నీటి కాలువ నిర్మాణం పనులను పరిశీలించడం జరిగిందని, కాలువ నిర్మాణం పనుల‌ను త్వరలో పూర్తిచేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అని, మియాపూర్ డివిజన్ పరిధిలోని చుట్టుపక్కల కాలనీ వాసులకు ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు లబ్ధి చేకూరుతుంద‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here