శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే స్థానికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ రోడ్డులో డ్రైనేజీ పైప్ లైన్ నీరు రహదారిపై ప్రవహిస్తుండడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో చర్యలు చేపట్టారు. డ్రైనేజీ నీళ్లను తొలగించి మరో పైప్‌లైన్‌కు అనుసంధానం చేశారు. దీంతో ట్రాఫిక్ సజావుగా కొనసాగుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.






