శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): కార్మికులను శ్రమదోపిడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కార్మికులను అణిచే ప్రయత్నం చేస్తుందని ఎస్ఎఫ్ఏ యూనియన్ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికుల పొట్ట కొడుతున్నారని కార్మికుల శ్రమ దోపిడిని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 42 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లనుతెచ్చి కార్మిక వర్గాన్ని అణిచివేతకు కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను రద్దు చేసే ధోరణి అవలంబిస్తుందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెను అన్ని కార్మిక రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని చందానగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గరనుండి ర్యాలీగా లింగంపల్లి చౌరస్తా వరకు INTUC ,AITUC, CITUC, MITUC కార్మిక నాయకులు శోభన్, కొంగరి కృష్ణ, కే చందు యాదవ్, రాములు, మురళి , కొమ్ము పరమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






