శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రిగా నియమితులైన గడ్డం వివేక్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ఏకాంత్ గౌడ్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీధర్ పటేల్, గణేష్ గౌడ్, నియోజకవర్గం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పల్నాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.






