చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతినగర్‌లో కాలనీ మహిళలతో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. 2020-21 సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15వేలు, ఇతర ప్రాంతాల్లో రూ.10వేలు ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్నులో 50 శాతం రాయితీని కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక మహిళలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ నవత రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఆస్తి పన్నులో 50 శాతం రాయితీని కల్పించడంతోపాటు పారిశుధ్య కార్మికులకు రూ.3వేల వేతనం పెంచి సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఆయన నిర్ణయం వల్ల ఎంతో మందికి ఉపయోగం కలుగుతుందన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలో వరద సహాయం అందని వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే సహాయం పొందేందుకు వీలుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రమణ కుమారి, శాంతి, కృష్ణ వేణి, అనూష, పూజ, పద్మ, లక్ష్మి, చంద్రకళ, ప్రమీళ, శ్రీదేవి పాల్గొన్నారు.