పెంపుడు జంతువుల కోసం శ్మ‌శాన‌వాటిక‌ను ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయం: PAC చైర్మన్ గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పెంపుడు జంతువుల మహాప్రస్థానాన్ని పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ క‌లిసి ప్రారంభించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో జి. హెచ్. ఎం. సి, రాగ ఫౌండేషన్ వ్యవస్థకుడు నందకిశోర్ అనే జంతు ప్రేమికుడితో కలిసి ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల మహాప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతు పెంపుడు జంతువుల కోసం స్మశాన వాటికను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన నందకిశోర్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. 500 గజా స్థలాన్ని స్థలన్ని జి జిహెచ్ఎంసి పా మెమరీస్ కు కేటాయించింది. మూగ జీవులు కూడా మనుషుల లాగే విశ్వాసంగా ఉంటాయని, అవి మృతి చెందితే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటిని కూడా దహనం చేయడం కోసం, పర్యావరణ కాలుష్యం దెబ్బతినకుండా ఆధునిక హంగులతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జంతు ప్రేమికులకు ఇదో చక్కటి అవకాశంగా మారనుందని తెలిపారు.

శ్మ‌శాన వాటిక‌ను ప్రారంభించిన PAC చైర్మన్ గాంధీ

కేవలం పెంపుడు జంతువులే కాకుండా కుక్కలు, పిల్లులు, కుందేలు, పక్షులు వంటి పెంపుడు జంతువుల అంత్యక్రియలు ఇక్కడ దహనం సంస్కారాలు నిర్వహిస్తామని నిర్వాహకుడు నందకిశోర్ తెలిపారు. 2500 రూపాయల చార్జీతో ఈ సేవ అందించబడుతుంది. ఈ సౌకర్యం ద్వారా జంతు కళేబరాలు సుమారు 45 నుంచి 60 నిమిషాల్లో బూడిద అవుతాయి. ఆధునిక గ్యాస్ ఆధారిత విధానంతో పనిచేసే ఈ వ్యవస్థలో బయటకి పొగ కూడా రాదు, ఇది పూర్తిగా పర్యావరణహితంగా ఉంటుంది. ఈ మహాప్రస్థానం జంతువులకూ గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరిపే లక్ష్యంతో రూపొందించబడింది. పెంపుడు జంతువుల యజమానుల ఆవేదనకు తగిన సంతృప్తిని అందిస్తూ, క్రిమికార‌కం కాకుండా మర్యాదపూర్వకంగా జరిగేలా ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. పెంపుడు జంతువుల స్మశాన వాటిక ఏర్పాటులో ఆధునిక హంగులు వినియోగించి, పర్యావరణ కాలుష్యం తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెంపుడు జంతువుల కోసం ఏర్పాటు చేసిన శ్మశాన‌వాటిక
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here