శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): అమెరికాలో గౌతమ్ అదానిపై వచ్చిన ఆర్థిక ఆరోపణలు, మణిపూర్ లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలు తదితర అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రదర్శనకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం ఖానామెట్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కదలి వెళ్దామని, తరువాత నెక్లెస్ రోడ్డులో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీగా జన సమీకరణ ఉంటుందని అన్నారు. అనంతరం రాజ్ భవన్ కు తరలివెళ్లడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.