ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపడుతాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ‌లో రూ 59.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, నేతాజీ నగర్ లో రూ 30.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

స్థానికుల‌తో మాట్లాడుతున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

అదేవిధంగా రాబోవు కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డివిజన్ లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. గచ్చిబౌలి డివిజన్‌ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రషీద్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకుడు కైలాష్ సింగ్ , మాజీ కౌన్సిలర్ ప్రకాశ్ సింగ్, శ్రీకాంత్ రెడ్డి, లోకెందర్ రెడ్డి, సుమన్ , బబ్లూ సింగ్, విశాల్ సింగ్, శివ రాజ్ సింగ్, సునీల్ సింగ్, అనాయ్ సింగ్ , రవీందర్ సింగ్, జై సింగ్, రాజా సింగ్, శాంకేశ్ సింగ్, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ , భిక్షపతి, నానక్ రామ్ గూడ వాసులు, నేతాజీ నగర్ కాలనీ వాసులు, స్థానిక నేతలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here