శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ శాలివాహన (కుమ్మరి) సంఘం ఆధ్వర్యంలో బిహెచ్ఈఎల్ టౌన్షిప్ నందు ఏర్పాటు చేసిన కార్తిక వన భోజనం కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వెనుకబడిన కులాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ వారిని తమ వంతు ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు ఉరిటీ వెంకట్ రావు, ప్రసాద్, మన్నేపల్లి సాంబశివ రావు, సయ్యద్ గౌస్, అమరేందర్ రెడ్డి, రవీందర్, కృష్ణ, శివ, మహిళలు ఊరిటీ వసుంధర, పావని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.