- రాజకీయాల్లోకి అడుగిడుతున్న కసిరెడ్డి భాస్కరరెడ్డి కోడలు
- బిజెపి రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీనివాస్‌కు బయోడెటా అందజేత
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ నుంచి భారతీయ జనతాపార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా తన కోడలు కసిరెడ్డి సింధురఘునాథ్‌రెడ్డికి అవకాశం కల్పించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర విపత్తుల నివారణ కమిటి కన్వీనర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆ పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి మంత్రి శ్రీనివాస్‌కు బయోడెటాను అందజేశారు. తాను గత నాలుగు దశాబ్ధాలుగా ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నానని, కామారెడ్డిలో ఏబివీపీ కార్యదర్శిగా, శేరిలింగంపల్లిలో బిజెపి మిడియా సెల్ కన్వీనర్‌గా, 24వ వార్డు అధ్యక్షుడిగా, మండల ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, గ్రేటర్ హైదరాబాద్ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ కన్వీనర్‌గా, చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్‌గా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాకు, ఆ తర్వాత తెలంగాణకు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ కన్వీనర్‌గా, బిజెపి రాష్ట్ర కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా, ప్రకృతి విపత్తుల నివారణ కమిటి రాష్ట్ర కన్వీనర్‌గా పార్టీలో భాద్యతలు నిర్వహస్తూ అనేక పోరాటాలు చేశానని వారికి గుర్తుచేశారు.

అదేవిధంగా జనంకోసం అనే స్వచ్ఛంద సంస్థ, గౌతమినగర్ సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారుగా స్థానిక ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ వస్తున్నానన్నారు. తన కుమారుడు కసిరెడ్డి రఘునాథ్‌రెడ్డి సైతం గత దశాబ్ధ కాలంగా స్థానిక రాజకీయాల్లో కొనసాగుతన్నాడని, ప్రస్థుతం బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నాడని తెలిపారు. ఐతే గ్రేటర్ ఎన్నికల్లో చందానగర్ డివిజన్ మహిళా రిజర్వేషన్ ఐన నేపథ్యంలో తన కోడలు కసిరెడ్డి సింధురఘునాథ్‌రెడ్డికి కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సింధూ చెన్నైలోని నిఫ్ట్ లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ పూర్తిచేసిందని, ప్రస్థుతం ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతందని అన్నారు. విద్యావంతురాలైన సింధూకు అవకాశం కల్పిస్తే డివిజన్‌లోని అన్ని వర్గాల ప్రజలతో తమకున్న సత్సంబంధాలతో భారీ మెజారిటీతో గెలిచి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా తమ అభ్యర్థన పట్ల మంత్రి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారని కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.






