శ్రీరామ్ నగర్ లో హాస్టల్స్ ను నిషేధించాలని నిరసన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని కొండాపూర్ డివిజన్ శ్రీరాం నగర్ ఏ బ్లాక్ కాలనీలో హాస్టల్స్ ఏర్పాటును నిరసిస్తూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కాలనీలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కాలనీ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ కమ‌ర్షియల్ హాస్టల్స్ ఏర్పాటు వల్ల కాలనీలో నివాసం ఉండే సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. తాగడానికి నీరు సరిపోవడం లేదని, డ్రైనేజి సమస్య ఏర్పడుతుందని అన్నారు. హాస్టల్స్ లో ఉండే వారు రాత్రుల్లో తాగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, గొడవలు, దొంగ తనాలు జరుగుతున్నాయని, మత్తు పదార్తాలకు అలవాటు పాడి కాలనీలో న్యూసెన్స్ సృష్టిస్తున్నారని, జీహెచ్ఎంసీ, పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశామని అన్నారు.

నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న కాల‌నీవాసులు

ట్రాఫిక్ సమస్య తోపాటు పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. హాస్టల్స్ ఏర్పాటుకు కాలనీ వాసులు తమ ఇండ్లను హాస్టల్స్ కు ఇవ్వొద్దని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సి బ్లాక్ అసోసియేషన్ సభ్యులు కూడా పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ లక్ష్మి, వాణి, వరాలు, శ్రీదేవి, లక్ష్మి, మాధ‌వి, కవిత, శ్రీదేవి, దేవిక, వర్కింగ్ ప్రెసిడెంట్ మేడిశెట్టి రాము, ప్రసాద్ రావు, శ్రీనివాస్, మల్లేష్, రమణ, చంద్రమౌళి, తిరుపతి, నర్సింహా రెడ్డి, రవి, భాస్కర్ రావు, అవుదేశ్ నారాయణ, బంగారెడ్డి, పాత్రుడు, ఈశ్వరయ్య, పుల్లయ్య, కృష్ణ మూర్తి, సంజీవ రెడ్డి, మల్లయ్య, నాగేశ్వర్ రావు, మూర్తి, మహేందర్ సింగ్, ఉన్ని, రఫీ, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here