శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, స్పెషల్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు పలు ఇతర స్పెషల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు అసెంబ్లీ భవనాల కమిటీ హాల్ నం.1లో సమావేశంలో పాల్గొన్నారు. సభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, రామారావు పవార్, కూనంనేని సాంబశివరావు, టి.భాను ప్రసాదరావు, అకౌంటెంట్ జనరల్ పి. మాధవి, అసెంబ్లీ లెజిస్లేచర్ డాక్టర్.వి నర్సింహా చార్యులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కొత్తగా ఎన్నికైన చైర్మన్, సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమను తాము పరిచయం చేసుకున్నారు.
