శేరిలింగంపల్లి, అక్టోబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి రైల్వే బ్రిడ్జి నాలా పనులను శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, స్థానిక కాలనీల వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి గానీ ఇక్కడ నీళ్లు నిలవకుండా వేరే దగ్గర సమస్య సృష్టిస్థాం అంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉన్న నాలా విస్తరణ చేయకుండా డ్రెయిన్ మళ్లింపు పనులు ఎలా చేపడతారని, సరైన ప్రణాళిక తో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కూడా చర్చించి జోనల్ కమిషనర్ ని కలిసి స్థానిక కాలనీవాసుల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకొని పనులు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, కృష్ణా రెడ్డి, సుదర్శన్ రావు, వెంకటేశ్వరరావు, సోమయ్య యాదవ్, శ్రీను, నరసింహ యాదవ్, కిషోర్ , కృష్ణ, విజయ్, స్థానిక కాలనీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.