శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో నిర్మాణంలో భాగంగా నాగపూర్ నమూనా ప్రకారం మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో మర్యాదపూర్వకంగా కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు నాగపూర్ నమూనా ప్రకారం మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం, ప్రజా సౌకర్యార్థం మియాపూర్ చౌరస్తా నుండి ఇస్నాపూర్ వరకు నాగపూర్ నమూనా ప్రకారం మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలో శాసన సభ సమావేశాలలో తాను మాట్లాడిన సంగతి విదితమేనని అన్నారు. ఈ విధానం ద్వారా నిర్మాణం సాఫీగా సాగుతుంవని, స్థలం సేకరణ, భవనాల తొలగింపు వంటి ఇతర అంశాల అవసరం ఉండదని, తక్కువ ఖర్చుతో త్వరితగతిన నిర్మాణం జరుగుతుందని, ఫ్లై ఓవర్ నిర్మాణం సులభతరం అవుతుందని అన్నారు. వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు.