శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి నగర్ కాలనీ లో ఉన్న నాయనమ్మ కుంట చెరువు సుందరీకరణ పనులలో భాగంగా చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ఇరిగేషన్ అధికారుల తో కలిసి కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని నాయనమ్మ కుంట చెరువు అభివృద్ధిలో భాగంగా చెరువును ఇరిగేషన్ అధికారిణి పావనితో కలసి పర్యటించి పరిశీలించడం జరిగిందని,చెరువు సుందరీకరణ, సంరక్షణ, చెరువును అభివృద్ధి చేయడం జరుగుతుందని, అదేవిధంగా చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్టను పటిష్ట పరిచేలా పునరుద్ధరణ చేస్తామని తెలిపారు.
మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని చెరువు సంరక్షణలో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ (కంచె) నిర్మాణం, చెరువు అలుగు నిర్మాణం, చెరువు సుందరీకరణ పనులు చేపడుతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారిణి పావని తదితరులు పాల్గొన్నారు.