శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సంరక్షణను బాధత్యాయుతంగా చేపడుతున్న పోలీసుల సేవలు మరువలేనివని యువజన కాంగ్రెస్ శేరిలింగంపల్లి అధ్యక్షుడు బి.సౌందర్య రాజన్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్బంగా అమరులైన పోలీసులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
