శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ లో దసరా పర్వదినం సందర్భంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని అమ్మ దేవాలయంలో జరిగిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.