శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో పలువురు మర్యాద పూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, ప్రసాద్, పద్మారావు, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, చింతల రాజు యాదవ్, శశాంక్, పవన్, ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.