శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో దసరా ఉత్సవాల సందర్బంగా ఐక్యం డాన్స్ కంపెనీ బెంగళూరు నుండి వచ్చిన భరతనాట్య కళాకారులు ప్రదర్శించిన అంశాలు గణేశ పంచరత్న, కంజదళ యాదాక్షి, దేవీ స్తుతి, ఓంకార రూపిణి, తిల్లాన అంశాలను రాహుల్, అనఘా ప్రకాష్, నేహా ప్రమోద్, అనూష, వంధ్య మహేష్, అన్వేష, శుభ, సాథ్వీగా సురేష్ ప్రదర్శించి మెప్పించారు.
శంకరానంద కళాక్షేత్ర పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ శిష్య బృందంచే ప్రదర్శించబడిన శ్రీ నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపుగా నలభై మంది కళాకారులు ప్రదర్శించారు. శ్వేతా ప్రసాద్ గాత్రం, శ్రీ శ్రీధరాచార్య మృదంగం, సాయి కోలంక వయోలిన్ పై సహకరించారు.