శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరు అయిన రూ.21.34 లక్షల చెక్కులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలోనాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, పోతుల రాజేందర్, చిన్నోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, ప్రసాద్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
