- లూకేఫ్ మాటున లూటీ చేస్తున్న బీహారీ
- అభిషేక్ నాథ్ ఆగడాలను అరికట్టాలి అంటున్న బాధితులు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక చోట్ల లూ కేఫ్ పేరుతో ఐక్సోరా కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెన్ ఉమెన్ టాయిలెట్ ఏర్పాటు చేస్తామని టెండర్ తీసుకొని ఎటువంటి సదుపాయాలు లేకుండా, అనుమతులు లేకున్నా ఇష్టా రాజ్యంగా వ్యవరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న అభిషేక్ నాథ్ పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి కంటెస్ట్ కార్పొరేటర్ సామెల్ కార్తీక్ అన్నారు. వ్యాపారం కోసం వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు చెబుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభిషేక్ నాథ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేలా కార్యాచరణ చేపడతామన్నారు. బాధితులకు, స్థానికులకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భాదితులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.