ముకేష్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో పండ్ల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని నల్లగండ్ల ఫ్లై ఓవర్ కింద గుడిసెలు వేసుకొని వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధి గురించి వచ్చి నివసిస్తున్న కూలీల‌కు, వారి పిల్ల‌ల‌కు ముకేష్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు శుశ్రుత రెడ్డి, మ‌నీష్ రెడ్డి ఆర్థిక సహాయంతో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వెంకట్ రెడ్డి ఆపిల్ పండ్లు, బత్తాయి పండ్లు, అరటి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ పేద‌ల‌కు త‌మ వంతు స‌హాయంగా ఈ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. మున్ముందు కూడా ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాములం అవుతామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్లు జాఫ‌ర్‌, శివ‌శంక‌ర్‌, ఆంజ‌నేయులు, జ‌మాల్‌, పాండు, శివ‌రాజ్‌, భీమ్ రావు, శ్రీ‌నివాస్‌, ర‌వికుమార్, సురేష్‌, భాస్క‌ర్‌, సునీత‌, రాధిక‌, కిర‌ణ్మ‌యి, ప్ర‌భావ‌తి, సుజాత‌, విద్యాసాగ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

చిన్నారుల‌కు పండ్ల‌ను పంపిణీ చేస్తున్న డాక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here