శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ పరిధిలో శానిటేషన్ వర్కర్లుగా విధులు నిర్వహించిన, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సీఐటీయూ శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ సోమవారం సర్కిల్ డీసీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ 21 లో శానిటేషన్ వర్కర్స్ గా విధులు నిర్వహించేవారు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారని అన్నారు. ఈ క్రమంలోనే కొందరు కార్మికులకు వయస్సు రీత్యా రిటైర్మెంట్ ఇచ్చారని అన్నారు. అయితే రిటైర్మెంట్ అయిన, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత దయనీయంగా మారిన కార్మికుల పరిస్థితి చూసి వారిని ఆదుకోవాలని కోరారు. వారికి కనీసం పెన్షన్ సౌకర్యం కూడా లేదని, కుటుంబ సభ్యులకు వారు భారంగా మారారని, కనుక వారిని ఆదుకోవాలని కోరారు.