దీప్తిశ్రీ‌న‌గ‌ర్‌లో ఉచిత వైద్య శిబిరం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ పార్కులో ఉన్న‌ హెల్త్ కేర్ సెంటర్ లో ఒమెగా హాస్పిటల్ గచ్చిబౌలి వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానికుల‌కు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు నిహాలా షరీన్, సాయితేజ, అనుష, ప్రసాదరెడ్డి మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నార‌ని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం క‌నుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానం, నడక కనీసం 40 నిమిషాలు చేయాల‌న్నారు. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సీతారామయ్య, సుమన్ రెడ్డి, మంగపతి, సురేష్, శేఖర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, వాణీ సాంబశివరావు, అమ్మయ్య చౌదరి, మల్లేశ్వ‌రి, నూతక్కి పూర్ణచంద‌ర్‌రావు, హాస్పిటల్ ప్రతినిధులు అనురాగ్, వెంకటేష్, కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here