సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ కృత‌జ్ఞ‌త‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ (PAC) గా నియమితులైన సందర్బంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బుధ‌వారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. సీఎంకు గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరెకపూడి గాంధీని అభినందించారు. నూత‌న‌ బాధ్యతల‌ను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ త‌న‌పై నమ్మకం ఉంచి త‌న‌కు PAC చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కి, ఐటీ, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల‌కు ప్రత్యేక కృతజ్ఞ‌తలు తెలియజేశారు. త‌న‌పై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పృథ్వి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here