నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీకి చెందిన భూలక్ష్మి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 60వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమన్నారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగిపేట భాస్కర్, గణపతి, శ్రీకాంత్ పాల్గొన్నారు.