- ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుడూం అనిల్ కుమార్, తెలంగాణ మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్ వి.తుకారాం నాయక్
నమస్తే శేరిలింగంపల్లి : ముజాఫర్ అహ్మద్ నగర్ లో 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా వేడుకల్లో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతరాజు లాలయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుడూం అనిల్ కుమార్, తెలంగాణ మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్ వి.తుకారాం నాయక్ హాజరై మాట్లాడారు. స్వాతంత్య్ర రావడానికి ఎంతో మంది త్యాగ ఫలితం ఉందన్నారు.
భగత్ సింగ్, రాజు గురు, సుగ్దేవ్, ఉద్ధం సింగ్, ఉరికంబాలను ముద్దు పెట్టుకున్నారని, అల్లూరి సీతారామరాజు తుపాకీ గుండ్లకు బలయ్యారని, ఈ పోరాటంలో ఎందరో మహానుభావులు జైలు జీవితం గడిపారని గుర్తచేశారు. భారతదేశం వ్యవసాయ రంగంలో, పరిశ్రమ రంగంలో, విద్య వైజ్ఞానిక రంగంలో పూర్తిగా అభివృద్ధి చెందలేదని, మన దేశంలో నిరక్షత, నిరుద్యోగం, ఆకలి చావులు, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై ఆత్మహత్యలు శ్రమజీవుల దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
డా. బాబా అంబేద్కర్ కన్న కలల్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజతంత్ర వాదులు, కార్మిక సంఘాలపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అనంత రామ్, యం. డి.మైహబూబ్ సాబ్, పి. యాదయ్య, టీ. రాములు, వెంకటేష్, రాంబాబు,యం. డి. మౌలానా , లక్ష్మణ్, రెడ్డి పాల్గొన్నారు.