- చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి నేతృత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేరుకున్న రాజీవ్ సద్భావన యాత్ర
- పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : కర్ణాటక రాష్ట్రం శ్రీపరంబుదూర్ నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు చేపట్టిన 33వ రాజీవ్ సద్భావన యాత్రకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఘనస్వాగతం పలికారు. 13వ తేదీ సాయంత్రం సంగారెడ్డి మీదుగా చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి నేతృత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేరుకున్న యాత్ర సందర్భంగా వారికి ఇలా ఘన స్వాగతం పలికారు.
ఆగస్ట్ 20వ తేదీన స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర కేపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ దొరై ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన శ్రీపరంబుదూర్ లో ప్రారంభమైంది ఈ యాత్ర. శేరిలింగంపల్లిలో ఘన స్వాగతం పలికిన అనంతరం రాత్రి బస ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం అనంతరం గాంధీభవన్ కు వెళ్లే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుని నేడు ప్రపంచ దేశాలకు పోటీ ఇచ్చే స్థానంలో ఉందని, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికీ చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని, ఐటీలో హైదరాబాద్ నిలబడడానికి ముఖ్యకారకులు రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన సంస్కరణలే అని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, నవీన్ రెడ్డి, పట్వారీ శశిధర్, అల్వాల్ భాస్కర్, అక్తర్ సింగ్, పద్మా రావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్యరాజన్, సల్మాన్, హనీఫ్, జంగయ్య, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.