నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, అందరివాడు, పోరాట యోధుడు స్వర్గీయ వంగ వీటి మోహన్ రంగా అని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగ వీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొనీ అన్నప్రసాదాలు వడ్డించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడారు. రాజకీయ దురందరుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి అని పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్ కాశినాథ్ యాదవ్ ,సత్యనారాయణ, కొంపల్లి శ్రీనివాస్, రాంబాబు, భాస్కర్, రవి రాజు, పాపారావు, దొరబాబు, సురేష్, మరియు మోహన రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.