తోటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారం

  • సైట్ విజిట్ కోసం తన సంస్థ సేల్స్ ఎగ్జిక్యూటివ్ తో యాదగిరి గుట్టకు వెళ్లిన యువతి
  • కారులో తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘటన
  • తెల్లవారు జాము వరకు కారులోనే తిప్పిన నిందితులు
  • ఉప్పల్ పోలీసులను ఆశ్రయించిన యువతి 
  • జీరో ఎఫ్ఐఆర్ నమోదు 
  • నిందితులు సంగారెడ్డి, జనార్ధన్ రెడ్డి అరెస్ట్

నమస్తే శేరిలింగంపల్లి: రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై తోటి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అత్యాచారానికి పాల్పడ్డారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓ యువతి నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఉప్పల్ లో నివాసం ఉంటున్నది. ఇందులో భాగంగా జూన్ 29వ తేదీన మియాపూర్ లోని జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటి ఇన్ఫ్రా డెవల పర్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేరింది. 30వ తేదీ స్థానికంగా ఓ ఉమెన్స్ హాస్టల్ లో చేరింది. అదే రోజు యాదగిరి గుట్టలో తమ సంస్థ సైట్ విజిట్ కోసం అదే సంస్థలో పనిచేస్తున్న తన టీం సభ్యులు సంగారెడ్డి, జనార్ధన్ రెడ్డిలతో కారులో వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తున్న క్రమంలో కారు బ్రేక్ డౌన్ అయ్యిందని మార్గ మధ్యంలో ఆపి కూల్డ్రింక్స్, స్వీట్స్ తినిపించారు. ఆ యువతి స్పృహ తప్పి పోగానే కార్ లో తీసుకెళ్ళి ఆమెను వివస్త్రను చేసి, తెల్లవారు జామున 3 గంటల వరకు ఆ యువతి కారులో తిప్పుతూ ఆమెపై దాడి చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మియాపూర్ హాస్టల్ వద్ద వదిలేసి వెళ్ళారు.

యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు

ఈ సంఘటనపై యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించగా జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు. ఆ యువతినీ మియాపూర్ పోలీసు స్టేషన్ తీసుకెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 2వ తేదీన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here