ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రకటనలో తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో, రంజాన్ పండుగను జరుపకోవాలన్నారు. తెలంగాణకు ప్రత్యేకమైన “గంగా జమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని అభిలాషించారు. ముస్లిం సోదర, సోదరీమణులకు ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here