- ఆలయ ధర్మకర్త, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నల్లగండ్ల గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన ఈ మహోత్సవానికి ఆలయ ధర్మకర్త, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్/హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. కల్యాణం విశిష్టత తెలియచేస్తూ ఒగ్గలో, పోతురాజుల విన్యాసాల నడుమ భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు.
కల్యాణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, ఎంబిసి డెవలప్ మెంట్ చైర్మన్ జేరిపాటి జైపాల్, తెలంగాణ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, ప్రజలు, మహిళలు, భారీసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.