నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్, సెంట్రల్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా డప్పు కొట్టు హరిబాబు యాదవ్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ బీసీ సంఘం ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ డప్పు కొట్టు హరిబాబు కు పుష్పగుచ్చం అందిస్తూ అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు జరగబోయే ఎన్నికల్లో బీసీలకు దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ యువత రాజకీయాల్లోకి రావాలని, రాజ్యాధికారాన్ని అవినీతి అగ్రవర్ణ కులాల నుండి చేజిక్కించుకొని చక్కటి పరిపాలనను అందించాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేలా చేయాలని అన్నారు. కార్యక్రమంలో పెద్ద రాజుల మధు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.