- మల్కాజ్ గిరిలో విజయ సంకల్ప రోడ్ షో కు భారీ సంఖ్యలో తరలివెళ్ళిన బీజేపీ శ్రేణులు
- చేవెళ్ల పార్లమెంట్ లో కాషాయ జెండా ఎగరటం ఖాయం
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ చార్జి రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : విజయ సంకల్ప రోడ్ షో కు శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప రోడ్ షో కు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మియాపూర్, న్యూ కాలనీ శివాలయం టెంపుల్ వద్ద నుండి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు.
ఈ ర్యాలీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ శేరిలింగంపల్లి ఇంఛార్జి రవికుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోందనని, నరేంద్ర మోదీ చేపట్టిన ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల దేశ ప్రజలకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. దేశ ప్రజల కోసం ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం , జి.ఎస్. టి, నగదు రద్దు ఇలా ఎన్నో సహాసాత్మకమైన నిర్ణయాలను తీసుకున్నారని కొనియాడారు. చేవెళ్ల పార్లమెంట్ లో కూడా కాషాయ జెండా ఎగరటం ఖాయమన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, నాగుల్ గౌడ్ , జితేందర్ ,రాజు శెట్టి, రామిరెడ్డి, రమేష్, ఆకుల లక్ష్మణ్, బాబు రెడ్డి, చంద్ర మోహన్, రవీందర్ నాయక్, వెంకటేష్, నరసింహ యాదవ్, విజయలక్ష్మి పాల్గొన్నారు.